Wednesday, 27 January 2016

రూకాలర్‌ నుంచి తప్పించుకోవడం ఇలా...

తెలియని నెంబరు నుంచి కాల్ వచ్చి, ఆ కాల్‌ను రిసీవ్ చేసుకోలేకపోతే, అది ఎక్కడ నుంచి, ఎవరి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి ఎక్కువ మంది ఉపయోగించే యాప్ ట్రూ కాలర్. ఈ యాప్ ద్వారా కాంటాక్ట్ వివరాలు అడ్రసుతో సహా తెలుసుకోవచ్చు. అయితే ఈ వివరాలను పొంది కొందరు మార్కెటింగ్ ఏజెంట్లు తరచూ ఫోన్ చేస్తుంటారు. మరి కొందరు మోసగాళ్లయితే ఈ సర్వీసును పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. ఈ సర్వీసు ద్వారా ఇంటి అడ్రస్ పొంది వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు. తద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు.
 
అయితే ఈ యాప్ నుంచి కాంటాక్ట్ వివరాలను తొలగించుకోవచ్చని తెలీయక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే అలా తీసేయాలంటే వారు కచ్చితంగా ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నవారై ఉండాలి. ఐఫోన్, అండ్రాయిడ్, విండోస్ వంటి వాటిల్లో ఈ యాప్‌ను ఉపయోగించే వారు తమ వ్యక్తిగత వివరాలను బహిర్గతం కాకుండా చేయవచ్చు. ముందుగా ఈయాప్‌లో అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్‌ను ట్రూకాలర్ సర్వీసు నుంచి తీసేయాలి.
 
ఆండ్రాయిడ్‌లో ట్రూ కాలర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయాలంటే..
యాప్‌ను ఓపెన్ చేసి దానిలో పైన లెఫ్ట్ కార్నర్‌లో ఉన్న టాప్ ద పీపుల్‌ను క్లిక్ చేయాలి. దానిలో సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎబోట్ పై క్లిక్ చేయాలి. దానిలో డీయాక్టివేట్ అకౌంట్‌ను క్లిక్ చేయాలి.
 
ఐఫోన్ వినియోగదారులు
యాప్‌ను ఓపెన్ చేసి పైన రైట్ కార్నర్‌లో ఉన్న ట్యాప్ ద గేర్ ఐకాన్‌ను సెలెక్ట్ చేయాలి. దానిలో ఎబోట్ ట్రూ కాలర్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత డీయాక్టివేట్ ట్రూ కాలర్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
 
విండోస్ వినియోగదారులు
యాప్‌ను ఓపెన్ చేసి కింద రైట్ కార్నర్‌లో ఉన్న త్రీ డాట్స్‌ను క్లిక్ చేయాలి. దానిలో సెట్టింగ్స్‌పై క్లిక్‌ చేసి హెల్ప్‌ను ఎంచుకోవాలి. దానిలో ఉన్న డీయాక్టివేట్ అకౌంట్‌పై క్లిక్ చేసుకోవాలి.
 
ట్రూకాలర్‌లో ఉన్న మీ అకౌంట్‌ను తొలగించిన తర్వాత వెంటనే మీ నెంబరును ఆ యాప్ నుంచి తీసేయండి. అందుకోసం..
1. ట్రూ కాలర్ అన్ లిస్ట్ పేజ్ కి వెళ్లాలి
2. దేశం కోడ్‌తో సహా మీ నెంబర్‌ను ఎంటర్ చేయాలి
3. ఆ తర్వాత ఫోన్ నెంబర్‌ని సర్వీసు నుంచి తీసేయడానికి కారణాన్ని ఎంచుకోవాలి.
4. వెరిఫికేషన్ క్యాప్చా టైప్ చేయండి
5. అన్ లిస్ట్‌పై క్లిక్ చేయండి.
ఈ విధంగా చేసిన 24 గంటల్లో మీ నెంబరును ట్రూ కాలర్ సర్వీసు నుంచి తొలగిస్తారు.

No comments:

Post a Comment